Telangana: 9 వేల అంగన్వాడీ పోస్టులకు ప్రభుత్వం కసరత్తు

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులను నియామకాలను చేపట్టడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

New Update
Telangana: 9 వేల అంగన్వాడీ పోస్టులకు ప్రభుత్వం కసరత్తు

Telangana Anganwadi Recruitment: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్ చెప్పడానికి రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి సమాయత్తమవుతోంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9 వేలకు పైగా పోస్టులు (9000 Posts) ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. వీటి కోసం నియామక ప్రక్రియకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి. ఈ పోస్టులకు ఏడు, పదో తరగతి (7th and 10th Pass) ఉత్తీర్ణులైన మహిళలు ఎవరైనీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Also Read:UCC: లివ్‌-ఇన్-రిలేషన్‌షిప్ జంటలకు ప్రభుత్వం షాక్‌.. అలా చేయకపోతే జైలు శిక్ష!

అంగన్వాడీ పోస్టుల ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలోనే ప్రకటిస్తామని కొన్ని రోజుల ముందే తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రకటించారు. అలాగే 4వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి పూర్తి కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ (Anganwadi Teachers), ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి కేవలం మహిళలు మాత్రమే అప్లై చేయాలని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 140 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31,711కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉండగా…3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక హెల్పర్ ఉంటే…మినీ కేంద్రాల్లో ఒకే టీచర్ ఉంటారు. హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేసి పూర్తి అంగన్వాడీ కేంద్రాలుగా చేయడంతో అక్కడ హెల్పర్ పోస్టులు (Helper Posts) అవసరమయ్యాయి.

Department of Women Development and Child Welfare

Advertisment
Advertisment
తాజా కథనాలు