Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం ప్లేస్‌లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు ఇచ్చేలా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

New Update
BREAKING: సొంత ఇళ్లు లేనివారికి రూ.5 లక్షలు.. కీలక ప్రకటన

Free House Scheme: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను (Six Guarantees) తెలంగాణ ప్రజలందరికి అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం కింద ఆరు గ్యారెంటీల పథకాల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటిలో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Party) అధికారంలోకి వచ్చిన రెండో రోజే అమలు చేసింది.

ALSO READ:  వైసీపీలోకి ఎన్టీఆర్ ఫ్రెండ్.. అక్కడి నుంచే ఎంపీగా స్టార్ డైరెక్టర్ పోటీ?

ఇందిరమ్మ ఇండ్లపై అప్డేట్..

తెలంగాణలో పేదలకు ఇళ్ల పథకంపై ప్రభుత్వం ముందడుగు వేసింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం (Indiramma Scheme) ప్లేస్‌లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు.

PMAY కింద తెలంగాణకు ఇళ్లు కేటాయించాలని ఆయనను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. PMAY నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాష్ట్రప్రభుత్వ నిధులతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రజాపాలనకు వస్తున్న దరఖాస్తుల్లో ఇళ్లకు సంబంధించినవే అధికంగా ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది.

ఇప్పటికే అమలైన పథకాలు..

మహాలక్ష్మి పథకం: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహాలక్షి పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) మహిళలకు ఉచిత ప్రయాణం (Free Bus Scheme) కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల ఆ హామీని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కేవలం తెలంగాణలోని మహిళలకే వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి ఈ పథకానికి మంచి స్పందన లభించింది.

ఆరోగ్య శ్రీ: తెలంగాణ ప్రజలందరికి పెద్ద ఆసుపత్రి లలో మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచింది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన దీనిని అధికారంలోకి వచ్చిన రెండో రోజే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

AP Elections: వైసీపీ థర్డ్ లిస్ట్.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు