Kodangal Elections: కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?

కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ నరేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండనుంది. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఈసారి తన సొంత నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వీరిద్దరి బలాబలాలు తెలుసుకోండి.

Kodangal Elections: కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?
New Update

Kodangal Elections History: తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి(Revanth Reddy) గత ఎన్నికల్లో ఓడిపోయిన కొడంగల్(Kodangal) నియోజకవర్గంలోనే బరిలో నిలుస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి నిలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని దెబ్బతీసిన పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy).. ఈసారి కూడా ఆయన్ను ఓడించి తన సత్తా ఏంటో చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఆమేరకు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వాస్తవంగా చూసుకుంటే కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మధ్యే టఫ్‌ ఫైట్ ఉండనుంది. మరి కొడంగల్‌లో ఎవరి బలం ఏంటి? ఎవరి ప్రొఫైల్ ఏంటో ఓసారి చూద్దాం..

రేవంత్ రెడ్డి..

కొడంగల్ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎందుకంటే.. అధికారం తమదే అంటున్న టీపీసీసీ సారథి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది. రేవంత్ చరిత్ర చూసుకున్నట్లయితే.. ఆయన పొలిటికల్ కెరీర్ గ్రాడ్యూయేషన్ సమయం నుంచే ప్రారంభమైంది. గ్రాడ్యూయేష‌న్ చ‌ద‌వుతున్న స‌మ‌యంలో రేవంత్ రెడ్డి అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్ నాయ‌కుడిగా ఉన్నారు. తొలుత టీడీపీలో జాయిన్ అయిన ఆయన.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో 2001-02 మధ్యలో టీఆర్ఎస్‌(ప్రస్తుతం బీఆర్ఎస్)లో పని చేశారు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా విజయం సాధించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టీడీపీ తరఫున పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ తరువాత 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్‌రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నారు. 2017 అక్టోబర్‌లో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. అయితే, ఆ ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసిన రేవంత్ పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అటు తరువాత కొడంగల్ నుంచి మల్కాజిగిరికి షిఫ్ట్ అయిన రేవంత్.. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి.. 2021లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్, కామారెడ్డి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో నిలుస్తున్నారు రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీ చేస్తుండగా.. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.

పట్నం నరేందర్ రెడ్డి..

మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడే ఈ పట్నం నరేందర్ రెడ్డి. ఆయన 2009 మే 2 నుండి 2014 జూన్ 1 వరకు కొడంగల్ నుండి టీడీపీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి(MLC) సభ్యునిగా, 2014 జూన్ 2 నుండి 2015 మే 1 వరకు తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా(MLC) పనిచేసారు. 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి(నేడు బీఆర్ఎస్) కార్యదర్శిగా నియమితుడయ్యారు. నరేందర్ రెడ్డి 2016 జనవరి 5నుండి 2018 డిసెంబరు 11 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. అయితే, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై 9,319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు కూడా రేవంత్ ప్రత్యర్థిగానే ఆయన పోటీ చేస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో గుర్నాథ్ రెడ్డి సపోర్ట్ పట్నం నరేందర్ రెడ్డికి ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గుర్నాథ్ రెడ్డి రేవంత్‌కు మద్ధతు ప్రకటించారు. దాంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

2018 ఎన్నికల ఫలితాలు..

2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలుపొందగా.. రేవంత్ ఓటమిపాలయ్యారు. నరేందర్ రెడ్డికి మొత్తం 80,754 ఓట్లు(49శాతం) పోలవగా.. రేవంత్‌కు 71,4354 ఓట్లు(43 శాతం) పోలయ్యాయి. దాంతో 9,319 ఓట్ల మెజార్టీతో రేవంత్‌పై నరేందర్ రెడ్డి గెలుపొందారు.

కొడంగల్ నియోజకవర్గం..

ఈ నియోజకవర్గం తెలంగాణలోని నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉంది. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన మేరకు.. అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. ఇక ఈ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. పునర్విభజనకు పూర్వం అసంపూర్తిగా ఉన్న మద్దూరు మండలం ప్రస్తుతం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరింది. ఇదివరకు ఈ నియోజకవర్గంలో ఉన్న దామరగిద్ద మండలం కొత్తగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసింది. ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలాలు మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కొడంగల్, దౌల్తాబాద్, బొమ్రాస్‌పేట, దుద్యాల్.

Also Read:

వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

#telangana-news #revanth-reddy #telangana-elections #telangana-politics #kodangal #narender-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe