Minister KTR: 50 ఏళ్లలో చేయనివాళ్లు ఇప్పుడు చేస్తారా? నిర్ణయం ప్రజలదే అంటున్న కేటీఆర్..

మంత్రి కేటీఆర్ 5వ సారి ఎమ్మెల్యేగా సిరిసిల్ల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ప్రజలు తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు కేటీఆర్.

New Update
Minister KTR: 50 ఏళ్లలో చేయనివాళ్లు ఇప్పుడు చేస్తారా? నిర్ణయం ప్రజలదే అంటున్న కేటీఆర్..

Telangana Elections: 5వ సారి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, ఈసారి కూడా భారీ మెజార్జీతో గెలుస్తాననే ధీమా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా జన్మనిచ్చి.. విదేశాల్లో సైతం గుర్తింపునిచ్చింది సిరిసిల్ల అని పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని అన్నారు. 15 ఏళ్లుగా అవినీతి రహితంగా పని చేశామని, సిరిసిల్ల ముఖచిత్రానే మార్చామని చెప్పారు కేటార్.

'పల్లెలు పచ్చ బడ్డాయి. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్నాం. మీ బిడ్డగా రాష్ట్ర స్థాయిలో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గడప గడపకు తిరగక పోయినా.. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నాను. గులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్నా. 55 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా? సంక్షేమం, అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా? నిర్ణయించుకోండి. ఒకే ఒక గొంతుకను అణచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు. మనకు మనకు ఏమన్నా ఉంటే మనం మనం పరిష్కరించుకుందాం.. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా? కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? నీళ్ళు కావాలా? కన్నీళ్లు కావాలా? స్కాములు కావాలా? స్కీమ్స్‌ కావాలా? సబ్బండ వర్ణాల అభ్యున్నతికి కృషి చేసేది బీఆర్ఎస్. కుల, మత పిచ్చితో పని చేసేది కాంగ్రెస్, బీజేపీలు. అలాంటి వారిని గెలిపిద్దామా? ఒకసారి ఆలోచించండి. సిరిసిల్ల జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. నేతన్నల తలతలు మార్చాం. ప్రలోభాలకు లొంగిపోతే ఆగం అవుతాం. గతంలో మాదిరిగా తప్పు చేస్తే.. మళ్ళీ 50 ఏళ్లు బాధపడవలసి వస్తుంది. మళ్ళీ ఢిల్లీ మొచేతి నీళ్ళు తాగే పరిస్థితి వస్తుంది.' అని కేటీఆర్ అన్నారు.

'సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు. సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది. నాకు ఇప్పుడు ఉన్న గౌరవం సిరిసిల్ల ప్రజలు పెట్టిన భిక్ష. సిరిసిల్ల ప్రజలకు తలవంపులు తెచ్చే పనులు చేయలేదు. 15 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. సిరిసిల్ల అడబిడ్డల వల్లే గౌరవం పెరిగింది. బాధ్యత కూడా పెరిగింది. మళ్లీ గెలిపిస్తారనే విశ్వాసం అయితే ఉంది.' అని సిరిసిల్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్.


Also Read:

మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!

కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..

Advertisment
తాజా కథనాలు