Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటించారు పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao). బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారంలోకి వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ (CM KCR) ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందినదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ALSO READ: మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్
గుడి బండ తండ,పెద్ద మాంగ్య తండాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతు.. 60 ఎండ్ల కాంగ్రెస్ పాలనలో తండాలు ఎలా ఉన్నాయో అని ఆలోచన చేసుకోవాలని వారిని కోరారు. గతంలో తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తానని వైఎస్ రాజశఖరరెడ్డి (YS Rajasakhara Reddy) అధికారంలోకి వచ్చాడని.. రిజర్వేషన్ పెంచుత అని చెప్పి 10 ఎండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
ALSO READ: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
కేసీఆర్ సీఎం అయ్యాక 10 ఏండ్లలోనే చెప్పినట్టుగానే తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి రిజ్వేషన్ లు పెంచారని అన్నారు. సీఎం కేసీఆర్ మహాత్ముడు అని కొనియాడారు. ఇలాంటి మంచి పనులు చేసిన కేసీఆర్ ను మనం గెలిపించుకొని.. కాపాడుకోవాలని అన్నారు. రైతులు కేసీఆర్ ను మోసం చేస్తే కన్న తల్లికి మోసం చేసినట్టెనని అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.