TS Elections: కుదిరిన కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. డీల్ ఇదే! ఎట్టకేలకు సీపీఐ-కాంగ్రెస్ పొత్తు కుదిరింది. సీపీఐ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చిందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చింది. By V.J Reddy 06 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Congress - CPI Alliance Confirmed: తెలంగాణలో రాజకీయాలు వాతావరణంలో మార్పుల వలే మారుతూ ప్రజలకు ఊహించిన ట్విస్టులు ఇస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ తో స్నేహం కటీఫ్ అని ప్రకటించిన కామ్రేడ్లు.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 14మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు 10 సీట్లను తాము పోటీ చేసేందుకు సీపీఐ (CPI), సీపీఎం (CPM).. కాంగ్రెస్ (Congress) అధిష్టానాన్ని కోరగా.. దానికి కాంగ్రెస్ రెండు సీట్ల చొప్పున ఇస్తామని తెలిపింది. నిరాశతో ఉన్న సీపీఎం నేతలు తామే సొంతగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం అయోమయంలో పడింది. ఇదంతా సరికాదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని (Revanth Reddy) రంగంలోకి దించింది. పొత్తులపై చర్చించేందుకు ఇవాళ సీపీఐ కార్యాలయానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. చర్చల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఐ కొత్తగూడెం నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీకి రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. Also Read: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే! రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం సీపీఐ నారాయణ మాట్లాడుతూ.."నెల క్రితం నిచ్చితార్థం అయింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కుదిరింది. కేసీఆర్ చేతిలో నుండి తెలంగాణని విముక్తి చేయడం మా లక్ష్యం. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పాలన బాగుంది. రాజకీయాలకు మతాన్ని జొడిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లీస్ మూడు ఒక్కటే. బీజేపీ, బీఆర్ఎస్ మద్య బంధం ఉంది కాబట్టే.. కవితని అరెస్ట్ చేయడం మానేశారు. బండి సంజయ్ కి బండి కట్టి ఇంటికి పంపారు. కేసీఆర్ నియంతృత్వ పొకడకి వ్యతిరేకంగా పోరాడాలి. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఫామ్ హౌజ్ పాలనకి వ్యతిరేకంగా పోరాడాలి. కొత్తగూడెం లో సీపీఐ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు పని చేయాలి. తమ ప్రభుత్వం వస్తే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది" అని అన్నారు. Also Read: బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది: కేటీఆర్ #congress #revanth-reddy #cpi #telangana-election-2023 #congress-cpi-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి