Telangana Elections: ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా పరిణమించారు. టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. దాంతో వీరిని బుజ్జగించేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు.

Telangana Election Polling: తెలంగాణ పోలింగ్.. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
New Update

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఓ అంకం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో అప్పటివరకూ నామినేషన్‌ వేయని అభ్యర్థులతో పాటూ చివరి నిమిషంలో బీఫామ్‌ దక్కించుకున్న అభ్యర్థులంతా చివరి రోజు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మధ్యాహ్నం మూడింటి దాకా క్యూలో ఉన్న అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. ఇక ఒక అంకం ముగిసిందనగానే మరో అంశం తెరపైకి వస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీలతో పాటూతో పాటు అన్ని పార్టీల్లోనూ టికెట్లు దర్కించుకున్న అభ్యర్థులతో పాటూ, టికెట్‌ రాని రెబల్స్‌ సైతం భారీగానే నామినేషన్లు వేశారు. దీంతో అప్రమత్తమైన పార్టీలు నామినేషన్లు వేసిన రెబల్ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలెట్టేశాయి.

చివరి రోజు గందరగోళం..

నామినేషన్లకు చివరి రోజైన శుక్రవారం అన్ని పార్టీల్లోనూ గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్, బీజేపీ ముందుగా ప్రకటించిన జాబితాల్లో కొన్ని మార్పులు చేయడంతో.. చాలా చోట్ల అసంతృప్తి చెలరేగింది. ఒకరి పేరు ప్రకటించి.. మరొకరికి బీఫామ్స్ ఇవ్వడంతో చాలా నియోజకవర్గాల్లో ఆందోళనలు తలెత్తాయి. అన్ని పార్టీల్లోనూ రెబల్‌గా ఇండిపెండెంట్స్ భారీగా నామినేషన్లు వేశారు. కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులపై దాడులు కూడా జరిగాయి.

కాంగ్రెస్‌లో భారీగా రెబల్స్‌..

మొత్తం 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉండగా, కొత్తగూడెం సీటును సీపీఐకు కేటాయించారు. బోధ్, నారాయణ్ ఖేడ్‌లో చివరి రోజు అభ్యర్థుల్లో మార్పులు జరిగాయి. అలాగే పటాన్ చెరులో ముందుగా ప్రకటించిన నీలం మధుకు కాకుండా శ్రీనివాస్‌కు బీఫామ్ ఇచ్చారు. దీంతో నీలం మధు అప్పటికప్పుడు బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, సూర్యాపేట నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి భంగపడ్డారు. సూర్యాపేట హస్తం పార్టీ టికెట్‌ను కాంగ్రెస్ హై కమాండ్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించడంతో పటేల్ రమేష్ రెడ్డి బోరున విలపించారు. ఇలా కాంగ్రెస్‌లో అసంతృప్తులు అధికంగా ఉండటంతో చాలా నియోజకవర్గాల్లో రెబల్స్ నామినేషన్లు వేశారు.

కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం..

టికెట్ రాని 20 మంది కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ఎన్‌ఎస్‌యూఐ నేత వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, బలరాం నాయక్, పారిజాత నరసింహారెడ్డితో సహా 20 మందికి కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చారు. టికెట్ రాలేదని అధైర్య పడొద్దని, తెలంగాణలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం రాబోతోందని కేసీ తెలిపారు. ఎవరిని చూసి ఇబ్బంది పడొద్దని, ప్రభుత్వంలో టికెట్ రాని నేతలు కూడా భాగస్వామ్యం అవుతారని కేసీ తెలిపారు. ‘మీ రాజకీయ భవిష్యత్తు బాధ్యత నాదే’ అని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని సమాచారం. మరోవైపు తుంగతుర్తి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తాజాగా తెలిపారు.

బీజేపీకి తప్పని రెబల్స్‌ బెడద..

బీజేపీ అభ్యర్థుల జాబితాల విషయంలోనూ గందరగోళం తలెత్తింది. చివరి జాబితాను శుక్రవారం ప్రకటించింది బీజేపీ హైకమాండ్. మళ్ళీ జాబితాలో అభ్యర్థులు కాకుండా చివరి క్షణంలో మార్పులు చేశారు. సంగారెడ్డి, వేములవాడలో ప్రకటించిన వారికి కాకుండా వేరే వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చారు. బీజేపీ టిక్కెట్లు ఆశించి భంగపడినవాళ్ళు కూడా నామినేషన్లు వేశారు. దాంతో కమలం పార్టీకి ఈసారి ఎన్నికల్లో రెబల్స్ బాధ తప్పేలా లేదు.

బీజేపీ మహిళా నేతల ఆవేదన..

మెన్న‌ నిర్మల్ రమాదేవి.. నేడు వేములవాడలో తుల ఉమ, కంటోన్మెంట్‌లో రజనీ టికెట్‌ దక్కకపోవడం ఆవేదన చెందుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును గణేష్ నారాయణ్‌కు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిలో బీజేపీ ఆశావాహులు ఉన్నారు. రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గణేష్ నారాయణ్‌కు రాత్రికి రాత్రే బీజేపీ టికెట్ ఎలా ఇచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ పెద్దలు కనీసం తమకు చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. వేములవాడలో చివరి నిమిషంలో పార్టీ షాక్‌ ఇవ్వడంతో తుల ఉమ కన్నీరు మున్నీరుగా విలపించారు. తుది జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ, ఆమెకు కాకుండా చివరి నిమిషంలో వికాస్‌ రావుకు బీఫామ్‌ ఇచ్చింది బీజేపీ.

Also Read:

లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..

సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తృటిలో తప్పిన ప్రమాదం..

#brs #telangana-news #congress #bjp #telangana-elections-2023 #telangana-politics #rebel-leaders
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe