Telangana Elections 2023 : బీఆర్ఎస్ పార్టీ మీద..విజయశాంతి సంచలన వ్యాఖ్యలు...ఏమన్నారో తెలుసా? బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఓటమి తథ్యమని సర్వేలన్నీ చెబుతున్నాయని విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ ను కూడా చేశారు. By Bhoomi 11 Oct 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బీజేపీ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడుతుందన్నారు. ఇది తాను చెబుతున్నది కాదని సర్వేలన్నీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్ినకలకు సంబంధించి ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యింది. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్ని అలర్ట్ అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ షురూ అయిన రోజే బిజేపీ ఆదిలాబాద్ లో సభను నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ నేతలు. ఇది కూడా చదవండి: ఆయుధాలతో ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా ఫ్లైట్ ..!! ఈ సమయంలో బీజేపీ నేత విజయశాంతి..కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు. ప్రీపోల్ సర్వేల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెబుతున్నాయన్నారు. ఈ అహంకార పూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో మార్పు తప్పదన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచన మారుతుందన్న విజయశాంతి...ఈసారి బీఆర్ఎస్ కు గుణపాఠం చెబుతారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలల్ల బీఆర్ఎస్ గెలుపుకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి.. దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం.. నేను నా తోటి తెలంగాణ… pic.twitter.com/t7Fs9MaSJ9 — VIJAYASHANTHI (@vijayashanthi_m) October 10, 2023 కాగా రాష్ట్రంలో బీజేపీ పవనాలు వీస్తున్నాయన్నారు. బీజేపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నాన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకూల పరిస్థితులను ఉపయోగించి విజయం సాధించాలంటూ బీజేపీ శ్రేణులకు అమిత్ షా సూచించారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు వ్యూహాలు అమలు చేయాలని పార్టీ ముఖ్యనేతలకు ఆదేశాలిచ్చారు. ఈనేపథ్యంలో విజయశాంతి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్…!! #brs #kcr #bjp #sensational-comments #vijayashanthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి