Minister KTR: ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు..ఏవి?.. కేటీఆర్ ఆన్ ఫైర్!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఇబ్బందులు ఉండేవని.. రాత్రి రైతులకు జాగారామే అయ్యేది అని విమర్శించారు. కరెంట్ వద్దనుకునే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని అన్నారు.

KTR: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
New Update

Telangana Elections: బీఆర్ఎస్ పార్టీని ఈసారి కూడా తెలంగాణలో అధికారంలోకి తెచ్చి.. హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకొనేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR) వలె జిల్లాల పర్యటన చేపట్టారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో  పర్యటించారు కేటీఆర్. ఈ పర్యటనలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలపై విమర్శల దాడి చేశారు.

ALSO READ: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు..

మంచిర్యాల రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు అయిందని అన్నారు. కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు మంచిగా అవుతున్నాయని.. రైతు బంధు, రైతు భీమా పథకాలు అందరికీ వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. 2014కు ముందు తెలంగాణ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని ప్రజలను కోరారు. 1969 నుంచి 2014 దాకా 58 ఏండ్లపాటు తెలంగాణను సావగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఇబ్బందులు.. ప్రతి రాత్రి రైతులకు జాగారామే అయ్యేది అని అన్నారు. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో రైతులు తేల్చుకోవాలని పేర్కొన్నారు. ఐటీ హబ్ కావాలా?.. పేకాట క్లబ్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. స్కీములు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి.. స్కాములు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ALSO READ: ఉద్యమకారులను కాంగ్రెస్ కాల్చి చంపింది.. కేసీఆర్ మండిపాటు!

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామని కేటీఆర్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామని తెలిపారు. రూ.400 గ్యాస్‌ సిలిండర్‌ను మోదీ (Modi) రూ.వెయ్యికి పెంచారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని పేర్కొన్నారు. రేషన్‌కార్డు ఉన్న వాళ్లందరికి రూ.5 లక్షల జీవిత బీమా, డిసెంబర్‌ 3 తర్వాత అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని 2014లో మోదీ చెప్పారు.. మోదీ చెప్పిన రూ.15 లక్షలు వచ్చినవారు బీజేపీకి ఓటు వేసుకోవచ్చని కేటీఆర్‌ తెలిపారు.

#ktr #modi #telangana-election-2023 #brs-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి