Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో 'కోట్ల' కట్టలు..

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 7.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అధికారులు.

Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో 'కోట్ల' కట్టలు..
New Update

IT Raids in Hyderabad: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు(IT Raids) ముగిశాయి. మూడు రోజులు జరిపిన తినిఖీల్లో అధికారులు రూ. 7.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహేశ్వరం ఎన్నికల కోసమే ఈ డబ్బును ఏర్పాటు చేసినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ప్రదీప్ రెడ్డితో పాటు.. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా.. ఆయన ఇంట్లో రూ. 7.50 కోట్లు నగదు పట్టుబడింది. దీంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు.. ఐటీ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అంతకు ముందు మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్‌, బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ నాయకురాలు సబిత టార్గెట్‌గా ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఐటీ అధికారులు వరుస సోదాలు చేస్తున్నారు. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఫార్మా ఇండస్ట్రీకి చెందిన పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీస్‌లలోనూ తనిఖీలు నిర్వహించారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్‌సీపురం, వట్టినాగులపల్లి, గచ్చిబౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించారు అధికారులు. సీఆర్పీఎఫ్‌ జవాన్లను సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు ఐటీ అధికారులు సమాచారం అందుకున్నారట. ఈ నేపథ్యంలోనే.. వరుసగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Also Read:

హయత్‌నగర్‌లో అర్థరాత్రి ఉద్రిక్తత.. మధుయాష్కి గౌడ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు..

 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..

#telangana-elections-2023 #telangana-politics #sabitha-indra-reddy #telangana-political-news #it-raids-in-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe