హైదరాబాద్లో 30 చోట్ల IT సోదాలు | IT Raids In Hyderabad | RTV
TG: హైదరాబాద్ కూకట్ పల్లిలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రెయిన్బో విస్టాన్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. BRK ఛానల్ అధినేత బొల్ల రాకమృష్ణ చౌదరి ఇంట్లో తెల్లవారుజాము నుంచి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 7.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అధికారులు.
హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
హైదరాబాద్ లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపాయి. కూకట్ పల్లిలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయన సోదరుల ఇళ్లలో సోదాలు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులు 100 బృందాలుగా విడిపోయి గురువారం ఉదయం నగరంలోని పలు కంపెనీలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సోదాలు కొనసాగుతున్నాయి.
ఊహించినట్టే అయ్యింది. బీఆర్ఎస్ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు బీజేపీ వేసిన ప్లాన్ లో భాగంగా ఈరోజు ఉదయాన్నే బీఆర్ఎస్నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.