Andhra Pradesh Rain Alert: అంగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం(Weather Alert) ఏర్పడింది. అండమాన్, నికోబార్ దీవులకు అనుకుని ఈ అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ వాయుద్య దిశగా కదులుతోందని చెప్పారు వాతావరణ కేంద్రం అధికారులు. ఈ అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుందని తెలిపారు. గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు అధికారులు. ఇదిలాఉంటే.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో.. రానున్న రెండు రోజులు తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి తీవ్ర వాయుగుండగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్నారు.
Translate this News: