/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Minister-KTR-jpg.webp)
Minister KTR Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసిన ఆయన.. బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇంతకీ కేటీఆర్ ఏం పోస్ట్ చేశారనేగా వేయిటింగ్. తెలంగాణలో మూడవ సారి విజయం సాధించడం ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఆ విశ్వాసంతోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తాను తుపాకీ ఎక్కి పెట్టి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. 'హ్యాట్రిక్ లోడింగ్.. గెట్ రెడీ టూ సెలబ్రేట్ గాయ్స్' అంటూ క్యాప్షన్ పెట్టారు.
Hattrick Loading 3.0 👍
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
— KTR (@KTRBRS) December 2, 2023
కేటీఆర్ పోస్ట్‌తో బీఆర్ఎస్ శ్రేణులు సరికొత్త జోష్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆయన ట్వీట్‌ను రీట్వీట్, పోస్టులను రీపోస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ విజయం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ పోస్టులకు కామెంట్స్ పెడుతున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు.
Also Read:
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు..