Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ.. కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎస్‌కు లేఖ రాసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందన్న నోటీసుల్లో ఈసీ పేర్కొంది.
ALSO READ: మందు బాబులకు ALERT.. రేపటి నుండి వైన్స్ బంద్!
రేపు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రకటనలు ఆపివేయాలన్న స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే, తెలంగాణలో ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తాము కర్ణాటకలో ఎన్నికల్లో చెప్పినట్టుగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఇంగ్లిష్, తెలుగు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఈసీ కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ప్రకటనలు ఇచ్చేందుకు తమ వద్ద కర్ణాటక ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పేర్కొంది.