FLASH: అమిత్ షా షెడ్యూల్ లో మార్పులు

అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు.

New Update
Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు

Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. కొన్ని కారణాల వల్ల టూర్ షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ ను అమిత్ షా కార్యాలయం విడుదల చేసింది. వాస్తవినికి ఈరోజు (శుక్రవారం) అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాలన్నీ రేపటికి వాయిదా పడ్డాయి. రేపు తెలంగాణ బీజేపీ మ్యానిఫెస్టోను (BJP Manifesto) అమిత్ షా విడుదల చేయనున్నారు.

ALSO READ: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు.. సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

అమిత్ షా షెడ్యూల్ పూర్తి వివరాలు:

* రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్న అమిత్ షా.
* ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రికి రావాల్సి ఉన్న అమిత్ షా.
* రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగం పేట విమానాశ్రయం కి రానున్న అమిత్ షా .
* 12.50కి గద్వాల చేరుకోనున్న కేంద్ర హోం మంత్రి.
* 1.35 నిమిషాల వరకు గద్వాల సభలో పాల్గొననున్న షా.
* 1.45కు గద్వాల నుంచి నల్లగొండ బయలుదేరనున్న కేంద్ర హోం మంత్రి.
* 2.45కు నల్లగొండ చేరుకోనున్న అమిత్ షా.
* 3.35 వరకు నల్లగొండ సభలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి.
* 3.40 కి నల్లగొండ నుంచి బయలుదేరి 4.20 వరకు వరంగల్ చేరుకోనున్న షా.
* 4.25 నుంచి 5.05 నిమిషాల వరకు వరంగల్ సభలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి.
* 6 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకి చేరుకోనున్న అమిత్ షా.
* 6.10 గంటలకు హోటల్ కత్రీయలో మ్యానిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా.
* 6.45 నుంచి 7.45వరకు క్లాసిక్ గార్డెన్ లో MRPS సమావేశంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి అమిత్ షా.
* సాయంత్రం 7.55 కి బేగం పేట విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ బయలుదేరనున్న షా.

Advertisment
తాజా కథనాలు