Telangana Elections: కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ఆ పార్టీ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే చెబుతున్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ స్క్రీనింగ్ మిటీ చైర్మన్ మురళీధరన్.. కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు . గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయత ఆధారంగా ఇవాళ్టి సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయ్యిందన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై.. మిగతా స్థానాలకు కసర్తుత పూర్తి చేస్తుందని చెప్పారు. మిత్రపక్షాల స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు మురళీధరన్. అవి పూర్తయిన తరువాత జాబితాను ఒకేసారి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైతే 70 సీట్లతో జాబితా సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్
ప్యామిలీ ప్యాక్ లేనట్లే..
ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మురళీధరన్ స్పష్టం చేశారు. జాబితాలో మైనారిటీలకు, మహిళలకు, బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఎన్ని సీట్లు ఇచ్చాం అన్నది టికెట్స్ ప్రకటించాక అందరికీ తెలుస్తుందని అన్నారు. టికెట్స్ ఇంకా ప్రకటించక ముందే ఓకే కుటుంబంలో ఒకరికి మించి సీట్లు అని ప్రచారం చేసుకుంటున్నారని, ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పునరుద్ఘాటించారు.
ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?