UPDATE ON NEW RATION CARDS: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో రోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలను రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందిచింది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కోసం నిబంధనలు, అర్హతల గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా రేషన్ కార్డు తీసుకోవడానికి రూల్స్ ఈ విధంగా ఉన్నాయి..
ALSO READ: టార్గెట్ కాంగ్రెస్.. నేడు కేటీఆర్ కీలక ప్రకటన
---గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడితే అనర్హులే.
---గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్నవారే అర్హులు.
---మాగాణి 3.5 ఎకరాలు, బీడు భూములైతే 7.5 ఎకరాలు.
---గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం.
---100 చ.మీ ఇల్లు, ఫ్లాట్, కారు, ట్రాక్టర్, ఏడాదికి రూ.1.5 లక్షల కంటే.
---ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్ కార్డు సరెండర్ చేయాల్సిందే.!
---ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్‌కంట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించినా అనర్హులే.
---డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేషన్ కార్డుకు అనర్హులే.
ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
తెలంగాణలో 2014 నుంచి రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. సంక్షేమ పథకాల అమలులో రేషన్ కార్డే కీలకం కావడంతో కొత్త ప్రభుత్వం రావడంతో జనాల్లో ఆశలు పెరిగాయి. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు రూ. 2500, విద్యార్థులకు రూ.5లక్షల భరోసా పథకానికి, రూ.10లక్షల ఆరోగ్యబీమాకు రేషన్ కార్డు కంపల్సరీ. అయితే వారి ఆశలకు ఎలాంటి భంగం కలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటిలో రెండిటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది.