BRS MLA KTR : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏ ట్రెండ్ నడుస్తుందని అడిగితే అందరు చెప్పే మాట శ్వేతపత్రాలు ట్రెండ్ అని అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గత 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రగతి రిపోర్టును(శ్వేతపత్రం) అసెంబ్లీలో ప్రస్తావిస్తోంది. ఇటీవల తెలంగాణ(Telangana) రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు గట్టిగానే జరిగాయి.
పూర్తిగా చదవండి..KTR : టార్గెట్ కాంగ్రెస్.. నేడు కేటీఆర్ కీలక ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అప్పులపై ఇచ్చిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు ఈ రోజు ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
Translate this News: