Congress Guarantees: రెండో గ్యారెంటీ అమలుకు శ్రీకారం..ఈరోజే రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు

తెలంగాణలో కాంగ్రెస్ చెప్పినట్టుగానే పథకాలను వెంటవెంటనే అమలు చేస్తోంది. తాజాగా రాజీవ్ ఆరోగ్య పథకాన్ని కూడా పట్టాలెక్కించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు రెండు గ్యారెంటీలు మొదలయ్యాయి. అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా ఇది రెండవది.

Congress Guarantees: రెండో గ్యారెంటీ అమలుకు శ్రీకారం..ఈరోజే రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు
New Update

Rajiv Aarogyasri Scheme: ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఆరు గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ (Congress). ఇందులో మొదటగా రెండు హామీల మీ దృష్టి సారించింది. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా… మరోకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని అమలు చేయటం. ఆరోగ్యశ్రీ బీమాను చేయూత స్కీమ్ కింద అమలు చేయనున్నారు. ఈ స్కీమ్ ను ఈరోజు నూతన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కలిపించనున్నారు. గతంలో ఇది ఐదు లక్షల వరకే పరిమితి ఉండగా… ప్రస్తుతం ఇది 10 లక్షల వరకు పెరుగుతోంది.

Also Read: ఇతని పొగరు మామూలుగా లేదుగా..అన్నంతపనీ చేసేసాడు

ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉన్న అన్ని ఆసుపత్రుల్లో అమలవుతుంది. ఈ పథకం కింద ఉన్న వారు… పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. 1,310 ఆసుపత్రిల్లో ఈ సేవలు సేవలు అందుతున్నాయి. వీటిల్లో 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీల ఉన్నాయి. ఇందులో దాదాపు అన్ని రోగాలకు సేవలు అందుతున్నాయి.

ఆరోగ్యశ్రీలో 1672 ప్యాకేజీలు...21 స్పెషాలిటీ ట్రీట్ మెంట్స్ కవర్ అవుతాయి. 2014లో ఆరోగ్య శ్రీ ప్రారంభించిన దగ్గర నుంచీ 18 లక్షల మంది దీన్ని ఉపయోగించుకున్నారు. దాదాపు తెలంగాణలో ఉన్న తొంభై లక్షల మంది ఈ పథకానికి అర్హులు.

#cm-revanth-reddy #telangana #rajiv-aarogyasri-scheme #congress-guarantees #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి