Runa Mafi : తెలంగాణ(Telangana) రైతులకు రేవంత్(Revanth) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ: ఢిల్లీలో సీఎం రేవంత్.. కోటి ఆశలతో కోదండరాం!
రూ.2లక్షల రుణమాఫీ..
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) అద్వర్యం కాంగ్రెస్ పార్టీ ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసింది. తాజాగా వైఎస్సార్ అడుగుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. లేదంటే రెండు దఫాల్లో పూర్తి చేయనుంది.
రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్..
తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్ల(Crop Loans) వల్ల వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. తర్వాత బ్యాంకులకు విడతలవారీగా ప్రభుత్వం కట్టనుంది. ఇందుకోసం SLBC, ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది సర్కార్.
2023 డిసెంబర్ 7వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తించనుంది. రూ.28వేల కోట్ల మేర లోన్లు ఉంటాయని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు. ఇందులో రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలే 80శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ చేయడం ద్వారా దాదాపు 30లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ALSO READ: వైసీపీ నాలుగో లిస్ట్.. ఎప్పుడంటే?