CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ?

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ తో కలిసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు.

New Update
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ?

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం మద్దతు కొరకు ఆయన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రేవంత్ భేటీ అయ్యారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తో భేటీ కానున్నారు. సీఎం రేవంత్ అమిత్ షాను కలవడంపై అనేక చర్చలకు దారి తీసింది. కాంగ్రెస్ ఏఐసీసీ (AICC) కమిటీ సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల కేటాయింపుపై హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం.

ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

అమిత్ షాతో.. భేటీ టార్గెట్ కేసీఆర్?

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రేవంత్ అమిత్ షాను కలవడంపై అనేక ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపించేందుకే రేవంత్ అమిత్ షా కలుస్తున్నారని వార్తలు చలామణి అవుతున్నాయి. మరోవైపు సీఎం కాళేశ్వరంపై (Kaleshwaram Project) సీబీఐ ఎంక్వైరీ కోరతారా?.. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కోరతారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.ఇప్పటికే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీకి (CBI Enquiry) సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని తెలంగాణ బీజేపీ నేతల అంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షా తో ఏమి మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!

జలశక్తి శాఖ మంత్రితో..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ కానున్నారు. జలశక్తిమంత్రిని కలిసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడగనున్నట్లు తెలుస్తోంది. గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన సీఎం రేవంత్ తెలంగాణలో గృహనిర్మాణాలకు సహకారం కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు