Uppal Stadium : హైదరాబాద్‌లో ఇవాళ మళ్ళీ సందడి నెలకొంది. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ vs చెన్నై(Hyderabad vs Chennai) మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. దాంతో పాటూ ధోనీ(Dhoni) బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు కూడా అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసీజన్‌లో హైదరాబాద్ జట్టు సన్‌రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలిచి ఒకదానిలో ఓడిపోయింది. అయితే తన బ్యాటింగ్ విన్యాసాలతో మాత్రం తెగ ఆకట్టుకుంటోంది. ట్రవిస్ హెడ్, అబిషేక్ శర్మ, క్లాసెన్ ఊచకోతను మరో సారి చూసేందుకు హైదరాబాద్ అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. సన్‌రైజర్స్ ఉప్పల్‌లో ఆడిన ఆడిన గత మ్యాచ్ ముంబై ఇండియన్స్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌కు సీఎం ఫ్యామిలీ..
ఇప్పుడు ఈ మ్యాచ్‌కు మరో అదనపు ఆకర్షణ యాడ్ అయింది. తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు మ్యాచ్ చూడ్డానికి కుటుంబ సమేతంగా వెళ్ళనున్నారు. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయనున్నారు సీఎం. గతంలో సీఎం హోదాలో ఉప్పల్ స్టేడియంకు కేసీఆర్(KCR) కూడా వెళ్ళారు. 9ఏళ్ల కిందట ఇండియా, శ్రీలంక మ్యాచ్‌ను ఆయన చూశారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ మొదటిసారి ఉప్పల్ స్టేడియానికి వెళుతున్నారు. సీఎం రేవంత్ కూడా మ్యాచ్‌కు వస్తుండటంతో ఫ్యాన్స్‌లో జోస్ మరింత పెరిగింది.
తొలగిన కరెంట్ కష్టాలు...
మరోవైపు ఉప్పల్ స్టేడియానికి ఉన్న కరెంట్ కష్టాలు తొలిగిపోయాయి. బిల్లులు కట్టలేదని అధికారులు తొలగించిన కరెంట్‌ను తిరిగి పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఐపీఎల్(IPL) మ్యాచ్‌ను దీష్టిలో ఉంచుకుని బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ అధికారులు ఒక రోజు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సన్‌రైజర్స్, సీఎస్‌కే మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
Also Read:Delhi: పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్..కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో