Minister Harish Rao: త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారన్నారు.

Big Breaking: ఈ నెల 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు సిద్ధం కావాలన్న హరీశ్ రావు
New Update

Telangana Elections: తెలంగాణ ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారని మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్‌ఎస్(BRS) మేనిఫెస్టోను ప్రకటించనున్నారని తెలిపారు. బుధవారం నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి హ‌రీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త వింటారని తెలిపారు మంత్రి. తెలంగాణలో అభివృద్ధి లేదంటే.. సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లేనని వ్యా్ఖ్యానించారు. ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడుచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ రోజు మంచినీళ్లు పట్టుకునే ప్రతి ఆడ పడుచు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రూ. 2 వేలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి అవ్వకు కేసీఆర్ పెద్ద కొడుకులాగా కనిపిస్తారని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తీసుకునే ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్ అని పేర్కొన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ కనిపిస్తారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్‌ను ప్రతిపక్షాలు కావాలని తిడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని తిడుతున్న ప్రతిపక్షాలు కావాలా? సంక్షేమం రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్ కావాలా? ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళా పక్షపాతి అయిన సీఎం కేసీఆర్.. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. నిజాన్ని ప్రచారం చేయకపోతే.. అబద్ధం రాజ్యమేలుతుందని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలంటే ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు.

కరోనా లాంటి మహమ్మారి వచ్చినా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఆపని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కరోనా విపత్తులో సైతం ఆసరా పెన్షన్ ఆగలేదని, కళ్యాణ లక్ష్మి ఆగలేదన్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టం అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ఆయన ప్రాతినిధ్యం వల్లే గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌ను భారీ మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. సిద్దిపేట కంటే ఎక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దామని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారన్నారు.

Also Read:

AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగుల‌కు జగన్ సర్కార్‌ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం!

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

#telangana-elections #telangana #cm-kcr #harish-rao #minister-harish-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe