Telangana : రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి రేపు సమావేశం కానుండగా.. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీలపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్!

Telangana Cabinet Meet :  తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి రేపు సమావేశం కానుండగా.. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్(Congress) నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీలపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు, ప్రజావానికి అందిన ఫిర్యాదులతోపాటు మరికొన్ని అంశాలు ఈ మంత్రిమండలి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

జాబ్‌ క్యాలెండర్‌పై చర్చ..
ఇక కేబినేట్ మీటింగ్ లో జాబ్‌ క్యాలెండర్‌(Job Calendar) పై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణపైనా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన(Praja Palana) కార్యక్రమం జనవరి 6తో ముగియగా.. 6గ్యారంటీలకు(6 Guarantees) పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 100 రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్‌ ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా అర్హులైన లబ్దిదారులకే 6 గ్యారంటీలను అందించేందుకు ఎంపిక ప్రక్రియ మొదలుకానుంది. అర్హులందరికీ సాయం అందాలని, జకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి : KTR: కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: రేవంత్ పై కేటీఆర్ ఫైర్

నెల రోజుల పాలన.. 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ నెల రోజలు పాలనకు సంబంధించి ఈ రోజు సోషల్ మీడియా(Social Media) వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సంకెళ్లను తెంచి, తెలంగాణ(Telangana) ప్రజలకు స్వేచ్ఛను పంచినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అంతేకాదు తాము సేవకులమే తప్పా.. పాలకులం కాదని చెప్పారు. అలాగే ఎప్పటికైనా తాను అన్నగానే ఉంటానని, పేదలు, యువత, ఆడబిడ్డల మొఖంలో ఆనందం చూడటమే తన లక్ష్యమన్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు