Governor's Quota MLC Seats: తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల పేర్లను కేబినెట్ తీర్మానం చేసింది. మరోసారి రెండు పేర్లను గవర్నర్ కు పంపనుంది రేవంత్ సర్కార్. ఎమ్మెల్సీలుగా కోదండరాం (Kodandaram), అమిర్ అలీఖాన్ (Aamir Ali Khan) పేర్లను ఫైనల్ చేసింది.
హైకోర్టు అడ్డంకి..
ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు తన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలో ఏదైనా అభ్యంతరం ఉంటే రాష్ట్ర మంత్రివర్గానికి తిప్పి పంపాలి తప్ప తిరస్కరించకూడదని తెలిపింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌లో ప్రతిపాదించిన రేవంత్ సర్కార్.. గవర్నర్‌కు పంపనుంది. దీంతో కోదండరాం, అమిర్ అలీఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికకు లైన్ క్లియర్ అయినట్టు అయింది.
ALSO READ: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
మంత్రిగా కోదండరాం…?
తాజాగా ప్రొఫెసర్ కోదండరాంకు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కుతుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఆయనను మంత్రి చేయడం కోసమే రేవంత్ సర్కర్ ఎమ్మెల్సీ పదవి కోసం ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయం కోసం తన పూర్తి మద్దతును ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి వర్గంలో విద్యాశాఖ ఖాళీగా ఉంది. అయితే.. ప్రొఫెసర్ గా కోదండరాం ను విద్యాశాఖ మంత్రి చేయాలని రేవంత్ సర్కార్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేస్తుందా? లేదా? అని వేచి చూడాలి. ఒకవేళ చేస్తే ఏ శాఖకు మంత్రి చేస్తుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.