Telangana : తెలంగాణ కేబినేట్ విస్తరణ తేదీ ఖరారు ! జూన్ 10న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కొత్త మంత్రులు ఎవరన్నదానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నట్లు సమాచారం. By B Aravind 25 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Cabinet Expansion : మరికొన్ని రోజుల్లో తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) విస్తరణ జరగనునుంది. జూన్ 10న దీన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కొత్త మంత్రులు ఎవరన్నదానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth) ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ నుంచి మదన్‌మోహన్‌రావు, సుదర్శన్ రెడ్డి పేర్లు.. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్, గడ్డం వివేక్, గడ్డం వినోద్ పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. Also read: ఐదు దశల పోలింగ్ వివరాలు వెల్లడి.. డేటా మార్చడం అసాధ్యమన్న ఈసీ ముక్తల్ నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి సైతం అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కేబినేట్ రేసులో మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohit) కూడా రేసులో ఉన్నారు. ఇక మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం సీనియర్ నేతలు లాబియంగ్ చేస్తున్నారు. Also read: ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు #cm-revanth #telugu-news #telangana-news #cabinet-expansion మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి