Agriculture Sector: అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను (Telangana Budget 2024) ప్రవేశపెడుతోంది రేవంత్ సర్కార్. రూ.2,91,159కోట్లతో ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ లో సంక్షేమానికి అత్యధికంగా నిధులు కేటాయించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది రేవంత్ సర్కార్. వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయించారు. అనుబంధ రంగాలైన.. ఉద్యానవన శాఖకు రూ.737 కోట్లను కేటాయించారు. పశుసంవర్ధక శాఖకు రూ.1980 కోట్లను కేటాయించారు. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Telangana Budget 2024: వ్యవసాయానికి పెద్దపీట.. చరిత్రలోనే తొలిసారిగా ఎన్ని వేల కోట్లంటే?
తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయానికి ఊతమిచ్చే నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లను కేటాయించారు.
Translate this News: