Sunitha Laxma Reddy : తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy) , కొత్త ప్రభాకర్ రెడ్డి , గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని కలిశారు. ఈ క్రమంలో వారంతా కూడా కాంగ్రెస్ లో చేరుతున్నామని వస్తున్న వార్తలను వారు ఖండించారు.
తాము ఎప్పుడూ కూడా కేసీఆర్ వెంటే ఉంటామని.. కాంగ్రెస్(Congress) లోనికి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మేము రేవంత్ ను కలవడం గురించి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో చేసిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చాలనే తాము రేవంత్ ను కలిసినట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం కానీ, పార్టీ మారే ఆలోచన కానీ లేదని వారు వివరించారు. తాము పార్టీ అధిష్టానం పై తమకు పూర్తి నమ్మకం ఉందని నియోజకవర్గాల అభివృద్ది కోసమే సీఎం ను కలిసినట్టు కొన్ని మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తల వల్ల తమ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని ఇక మీదట ఈ విషయం గురించి ఆపాలని ఆమె కోరారు.
తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు అయినా కూడా ముఖ్యమంత్రిని కలుస్తామని సునీతా తెలిపారు. '' ముఖ్యమంత్రిని ఇంకా వందసార్లు కలుస్తాం... నెలకు ఓ సారైనా కలుస్తాం. తమ నియోజకవర్గాల అభివృద్ది కోసం ఎక్కడి వరకైనా పోతాం. ఎవరినైనా కలుస్తామని'' ఆమె స్పష్టం చేశారు.
ప్రతిపక్షం పార్టీలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వెనుకాడేది లేదని ఆమె అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని, కేసీఆరే తమ నాయకుడని స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Also read: రెండో రోజు కూడా అయోధ్యలో కొనసాగుతున్న భారీ రద్దీ..!