Telangana Elections: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. సునీతా లక్ష్మారెడ్డికే బీఫామ్ కన్ఫామ్..
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని ప్రకటించారు. ఆ మేరకు ఆమెకు బుధవారం నాడు బీఫామ్ కూడా అందజేశారు. అయితే, ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ స్థానం కేటాయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.