Kishan Reddy: కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి.. కిషన్ రెడ్డి హెచ్చరికలు కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని కిషన్ రెడ్డి అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. వీటన్నింటికీ కాంగ్రెస్ పార్టీ మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. By V.J Reddy 11 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP Chief Kishan Reddy: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి (ayodhya ram mandir) కాంగ్రెస్ పార్టీ (Congress Party) హాజరు కాకపోవడంపై తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హిందూ (Hindu's) వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని అన్నారు. ALSO READ: మేము గెలిచుంటే కేటీఆర్‌ను జైళ్లో పెట్టేవాళ్ళం.. బండి సంజయ్ గరం ఓట్ల కోసమే... ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావద్దని నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోందని అన్నారు. అయోధ్య కేసు విచారణ సమయంలో కాంగ్రెస్ వితండవాదం చేసిందని మండిపడ్డారు. అసలు రాముడు ఉన్నాడా అంటూ కోర్టులో వాదనలు వినిపించిందని అన్నారు. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైందని పేర్కొన్నారు. దేశ సమగ్రతను దెబ్బ తీస్తోంది.. కాంగ్రెస్ 70ఏళ్ళు రాముడి ఉనికిని తొక్కేసిందని కిషన్ రెడ్డి అన్నారు. రాముడు ఉన్నాడా అని అఫిడవిట్ దాఖలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఫైర్ అయ్యారు. బహిష్కరించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని.. అందుకే G20 , పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల సమావేశాలను బహిష్కరిస్తూ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ అభద్రత భావం దేశ సమగ్రతను దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హిందువులకు విలువ ఇవ్వట్లేదు. క్యాన్సర్ , కరోనా తో పోల్చారు.. కాంగ్రెస్ పార్టీ హిందువులకు విలువ ఇవ్వట్లేదని అన్నారు కిషన్ రెడ్డి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వం కాంగ్రెస్ ది అని విమర్శలు చేశారు. వారా దేశం గురించి మాట్లాడేది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హిందువులకు సంబంధించిన ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సనాతన ధర్మాన్ని క్యాన్సర్ , కరోనా తో పోల్చారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కి నొప్పి ఎంటి?.. పవిత్రమైన అయోధ్య అంక్షితలను దేశమంతా తిరిగి ఇంటింటా పంచుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ సింది కాలనీ లో అంక్షింతలు పంచుతున్న వారిని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ఈ ఘటన గత నెల 29న జరిగితే వారం రోజుల తర్వాత FIR నమోదు చేశారని అన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి ఘటన జరగలేదని వ్యాఖ్యానించారు. ఓవైసీ మెప్పు కోసం కాంగ్రెస్ ఇటువంటి విధానం అవలింబిస్తోందని ఫైర్ అయ్యారు. అంక్షింతల పంపిణీతో కాంగ్రెస్ కి కలిగిన నొప్పి ఎంటి?.. పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. గాంధీజీ రామరాజ్యం రావాలని కోరుకున్నారని తెలిపారు. వీటన్నింటికీ కాంగ్రెస్ పార్టీ మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ALSO READ: 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. పీఎం కిసాన్ ఎకరాకు రూ.12,000..? #bjp #congress-party #kishan-reddy #ayodya-rama-mandhir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి