/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ts-assembly-inside-jpg.webp)
Alert : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Telangana Assembly Speaker) పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి అంటే డిసెంబర్ 13న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశం శనివారం జరిగిన విషయం తెలిసిందే. మూడవ అసెంబ్లీ తొలి సమావేశంలో కొత్త ఎన్నికమైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన అక్బరుద్దీ ఒవైసీ.. వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, పూర్తిస్థాయి స్పీకర్‌ను డిసెంబర్ 14వ తేదీన అసెంబ్లీ ఎన్నుకోనుంది. అదే రోజున స్పీకర్ ఎంపిక కోసం ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజున స్పీకర్ బాధ్యతలు కూడా చేపడతారు. కాంగ్రెస్ తరఫున స్పీకర్ అభ్యర్తిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను ప్రకటించింది. సభలో కాంగ్రెస్‌కు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే స్పీకర్‌గా ఎన్నికవడం ఖాయం అని చెప్పొచ్చు.
Aslo Read:తాను సీఎం అభ్యర్ధిని కానని ప్రకటించిన బాబా బాలక్ నాథ్.. కారణాలు ఇవేనా?
ఇక ఎల్లుండే కాంగ్రెస్(Congress) తరఫున ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఇక సంప్రదాయం ప్రకారం.. శాసనసభా వ్యవహారల మంత్రి అయిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. సభలో బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ శాసనసభాపక్ష నేతలను కలిసి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కోరునున్నారు.