తెలంగాణ అసెంబ్లీ డిసెంబర్ 14వ తేదీకి వాయిదా.. ప్రమాణ స్వీకారం చేయని 18 మంది సభ్యులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా.. 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 7, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి 8 మంది సభ్యులు సభకు రాలేదు.

New Update
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణ మూడవ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వీరిచే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తరువాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తరువాత మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, సభలో 119 మంది సభ్యులుంటే.. 18 మంది సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరంతా సభకు గైర్హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేయని వారు ఎవరో ఓసారి చూద్దాం..

బీఆర్ఎస్..

కేసీఆర్
కేటీఆర్
కడియం శ్రీహరి
పాడి కౌశిక్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డి
టి. పద్మారావు
పల్లా రాజేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి
బత్తుల లక్ష్మారెడ్డి

బీజేపీ

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సూర్యనారాయణ ధన్‌పాల్‌
కాటేపల్లి వెంకట రమణారెడ్డి
పైడి రాకేష్‌రెడ్డి
పాల్వాయి హరీష్‌బాబు
పాయల్‌ శంకర్‌
రామారావు పవార్‌ పటేల్‌
రాజాసింగ్‌

Also Read:

కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..!

Advertisment
తాజా కథనాలు