TS, AP Lok Sabha Seats: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ షాక్.. భారీగా తగ్గనున్న ఎంపీ సీట్లు.. ఎన్నంటే?

2026లో జరిగే లోక్ సభ నియోజవర్గాల పునర్విభజనలో తెలంగాణ, ఏపీలో భారీగా సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 42 ఉండగా.. 5 నుంచి 8 సీట్లు తగ్గనున్నాయి.

New Update
TS, AP Lok Sabha Seats: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ షాక్.. భారీగా తగ్గనున్న ఎంపీ సీట్లు.. ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నియోజకవర్గల పునర్విభజనలో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జనాభా ప్రాతిపదికన చేపట్టనున్న ఈ విభజనలో రెండు రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు (Lok Sabha Seats) తగ్గనున్నాయి. ఇలా జరిగితే కేంద్రంలో ఇరు రాష్ట్రాలకు పట్టు తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో (Telangana) 17, ఏపీలో (Andhra Pradesh)  25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపితే తెలుగు రాష్ట్రాల లోక్ సభ సీట్ల సంఖ్య 37కు తగ్గనుంది. అదే.. 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకర్గాల పునర్విభజన జరిపితే.. ఇరు రాష్ట్రాలకు కలిపి కేవలం 34 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కనున్నాయి. దీంతో ఎలా జరిగినా కూడా తెలుగు రాష్ట్రాలు 5-8 ఎంపీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

దేశంలో రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ ఈ అశంపై ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం రాదన్న హామీని ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గతంలోనే ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. జనాభాను నియంత్రించాలన్న కేంద్రం సూచనలు పాటించిన దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో తీవ్ర అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను, విధానాలను లెక్కచేయకుండా.. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు లోక్ సభ సీట్ల పునర్విభజనలో లాభం పొందడం దురదృష్టకరమని వాఖ్యానించారు. కేవలం జనాభా నియంత్రణలో మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ ముందు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కేవలం 18 శాతం జనాభాతో 35 శాతం GDP నిధులు అందిస్తున్నాయన్నారు.

Also Read:
Hyderabad: ప్రసంగం మధ్యలో కేటీఆర్ ఫోన్ కు ఎమర్జెన్సీ అలర్ట్.. మంత్రి ఏం చేశారంటే?

Advertisment
తాజా కథనాలు