Telangana:కారు బోల్తా..తెలంగాణ విప్ కు గాయాలు తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ప్రమాదంలో లక్ష్మణ్ , ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. By Manogna alamuru 19 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Whip:తెలంగాణ విప్‌కు ఊహించని ప్రమాదం ఎదురయ్యింది. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఎండపల్లి మండలం అంబారీ పేట దగ్గర విప్, దర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కురు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌తో పాటు మరి కొంత మందికి గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అలాగే పెద్ద గాయాలు కూడా కాలేదు. స్వల్పంగా గాయపడిన లక్ష్మణ్, ఇతరులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది. Also Read:నేడు లక్నోలో పర్యటించనున్న మోదీ.. రూ.10 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం! ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ నిన్న హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గానికి బయలుదేరారు. అతనితో పాటూ మరి కొంత మంది కారులో ఉన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి దగ్గరకు వచ్చేసరికి అర్ధరాత్రి 3.15 అయింది. అదే సమయంలో కారు ప్రమాదానికి గురయింది. కారు చాలా వేగంగా వెళుతోంది. ఇంతలో లారీ అడ్డురావడంతో దాన్ని తప్పించబోయాడు డ్రైవర్.. ఈక్రమంలో వేగానికి అదుపు తప్పి కారు బోల్తా పడింది. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్‌లు వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మన్, ఇంకా కారులో ఉన్నవారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయనను వెంటనే కరీంగనర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పలువురు అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎందుకైనా మంచిదని... మరింత మెరుగైన చికిత్స కోసం లక్ష్మణ్‌ను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని అనుకుంటున్నారు. #telangana #accident #car #karimnagar #adluri-lakshman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి