Telangana : విద్యార్ధులకు అలెర్ట్.. ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

ఉన్నత చదువులే మీ లక్ష్యమా.. డిగ్రీ అయిపోయి ఏం చదవాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కోర్సులు మీకోసమే. కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు టీఎస్ఐసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

New Update
TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..

Notification For MBA, MCA Studies : డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధులకు శుభవార్త. ఉన్నత చదువులు మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయ(Kakatiya University) అధికారులు టీఎస్ఐసెట్‌(TS ICET) షెడ్యూల్‌ను విడుదల చేశారు. నిన్న అధికారులు దీన్ని విడుదల చేశారు.

Also Read : Telangana : బీఆర్ఎస్‌కు మరో ఎదురు దెబ్బ.. కాంగ్రెస్‌లోకి కోనప్ప

ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చును. పెనాల్టీ ఫీజుతో ఈ గడువు మే 27 వరకు అవకాశం కల్పించారు. జూన్ 4,5 తేదీల్లో ఈ ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 28 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోవచ్చును. జూన్ 28న పరీక్షా ఫలితాలు వెల్లడిస్తారు.

ఫీజు..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు అప్లై చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అయితే రూ.500 చొప్పున...ఇతరులు అయితే 750 రూ. చెల్లించాలి. గడువు డేట్‌తో దాటిపోతే మాత్రం మరో 500రూ. కట్టాల్సిందే.

Also Read : Gold Rates: ఇంక కొనలేమా..కొండెక్కుతున్న బంగారం ధరలు

Advertisment
తాజా కథనాలు