మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో దంతాల శుభ్రత అనేది ముఖ్యమైన భాగం. కానీ మనలో చాలామంది తరచుగా దంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. దీంతో దంత క్షయం, పంటి నొప్పి, చిగురువాపు, నోటి దుర్వాసన మొదలైన వివిధ సమస్యల బారినపడుతుంటారు. అందుకే మన నోటి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైన ప్రక్రియ అంటున్నారు వైద్యులు. చిన్న చిన్న పరిశుభ్రత చిట్కాలను పాటిస్తే ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లు మనసొంతం అంటున్నారు.
Also read :అద్భుతం చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు.. మనిషి ఇమ్యూనిటీ పవర్ వెయిట్ కొలిచేశారు
ఈ మేరకు తాజాగా అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. దాదాపు 20శాతం మంది అమెరికన్లు హార్డ్‌గా బ్రష్ చేయడం ద్వారా దంతాలపై ఉండే రక్షిత పొర ఎనామెల్ పాడైపోయిందని తెలిపారు. ఇది సెన్సిటివ్ టీత్, గమ్‌లైన్, పీరియాంటల్ సమస్యలకు దారితీసిందని వెల్లడించారు. అందుకే దంతాల సంరక్షణకు ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లాస్ చేయడం, సరైన మౌత్ వాష్ వినియోగించడం ద్వారా డెంటల్ హెల్త్ కాపాడుకోవచ్చని చెప్తుంటారు. అయితే కొందరు దంతాలు తెలుపుగా కనిపించాలంటే.. ఎక్కువ ఫోర్స్‌తో బ్రష్ చేయాలనే భ్రమను కలిగి ఉంటారు. కానీ ఈ అత్యుత్సాహం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోగా.. ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి వారు వేడి, చల్లటి ఆహారాలకు సెన్సిటివిటీ కలిగి ఉంటున్నారని చెప్పింది. ఒక్కసారి ఎనామెల్ అరిగిపోయిన తర్వాత మళ్లీ పునరుత్పత్తి చేయబడదని.. ఇది కాస్త కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుందని వివరించింది. అయితే ఈ హార్డ్ బ్రషింగ్ ప్రమాదాల నుంచి బయటపడాలంటే.. బ్రష్ చేసే టైమ్‌లో పళ్లపై ఒత్తిడి పెంచుతున్నారో లేదో తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఇందుకు ఒక చిట్కా అందిస్తున్నారు నిపుణులు. పండిన టొమాటోను బ్రష్ చేస్తున్నట్లు ఊహించుకోమని సూచిస్తున్నారు. దాని ఉపరితలం పాడు కాకుండా శుభ్రం చేయడానికి ఎంత ఒత్తిడిని వినియోగిస్తారో అంతే ఫోర్స్ పళ్లపై వర్తింపజేయాలని చెప్తున్నారు.