Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఏడాది జనవరిలో ఇది రెండో ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. జేఈఈ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న నిహారిక(18) అనే అమ్మాయి తాను జేఈఈ చేయలేనంటూ సూసైడ్‌ నోట్ రాసి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

New Update
Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఈ ఏడాది కూడా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఇక్కడ ఏకంగా 29 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోటాలని శిక్షా నగ్రి అనే ఏరియాలో ఉంటున్న నిహారిక(18) అనే అమ్మాయి జేఈఈ మెయిన్స్‌ పోటీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటోంది.

Also Read:  ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపిన ప్రియుడు..

నేను జేఈఈ చదవలేను

జనవరి 31న ఆమె రాయాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఉంది. కానీ జేఈఈ పరీక్షకు సిద్ధం కావడం తనవల్ల కాకపోవడంతో చివరికి తన గదిలో ఉరేసుకొని చనిపోయింది. అంతేకాదు ఆమె చనిపోయే ముందు ఓ సూసైడ్‌ నోట్‌ కూడా రాసింది. ఆ లేఖలో ' నాన్న నేనొక వరస్ట్‌ కూతురుని. నేను జేఈఈ చదవలేను. ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను లూసర్‌ని, వరస్ట్‌ కూతురుని. క్షమించండి అమ్మ నాన్న ఇది నా చివరి ఆప్షన్ అంటూ' రాసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో ఇది రెండో విద్యార్థి ఆత్మహత్య కావడం ఆందోళన రేపుతోంది.

గత ఏడాది 29 మంది ఆత్మహత్య

ఇదిలాఉండగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ జైద్‌ (18) అనే విద్యార్థి కోటాలో నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. కానీ ఒత్తిడిని తట్టుకోలేక జనవరి 23న అతడు తన హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. అయితే గత ఏడాది కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోచింగ్‌ సెంటర్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆత్మహత్యలు ఆగిపోవడం లేదు.

Also Read: డిగ్రీ అర్హతతో ‘ఎన్‌ఆర్‌ఎస్‌సీ’లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే

Advertisment
తాజా కథనాలు