/rtv/media/media_files/2025/09/24/waterproof-mobile-offers-2025-09-24-18-40-50.jpg)
Waterproof Mobile Offers
Amazon తన Great Indian Festival Sale 2025లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో కొత్త వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే సరైన సమయం. అతి తక్కువ ధరకే వాటర్ ఫ్రూప్ మొబైల్‌ను కొనుక్కోవచ్చు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Amazon Great Indian Festival Sale 2025
Vivo V60 5G
Vivo V60 5G మొబైల్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.36,999కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై ఫ్లాట్ రూ.2450 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత Vivo V60 5G రూ.34,549లకి లభిస్తుంది. దీంతోపాటు పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.35,149 ఆదా చేయవచ్చు. Vivo V60 5G ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68/IP69 రేటింగ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
Oppo Reno 13 5G
Oppo Reno 13 5Gలోని 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.26,999 కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,250 వరకు) పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత Oppo Reno 13 5Gను రూ.25,749కి పొందొచ్చు. Oppo Reno 13 5G వాటర్ అండ్ రెసిస్టెన్సీ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 5800mAh బ్యాటరీతో వస్తుంది.
Motorola Edge 60 Fusion 5G
Motorola Edge 60 Fusion 5G లోని 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.22,344 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో.. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,250 వరకు) పొందొచ్చు. ఆ తర్వాత దీని ధర రూ.21,094 కు చేరుకుంటుంది. Motorola Edge 60 Fusion 5G వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.
Redmi Note 14 Pro 5G
Redmi Note 14 Pro 5G మొబైల్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.21,998 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో.. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,250 వరకు) పొందొచ్చు. ఆ తర్వాత దీని ధర రూ. 20,748 కి చేరుకుంటుంది. Redmi Note 14 Pro 5G వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.
Realme P3x 5G
Realme P3x 5G మొబైల్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.12,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,250 వరకు) లభిస్తుంది. దీని తర్వాత ధర రూ.11,749 కి చేరుకుంటుంది. Realme P3x 5G వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 6,000mAh బ్యాటరీతో వస్తుంది.