Washing Machine Offers: రూ.3,269లకే వాషింగ్ మెషీన్‌.. ఫ్లిప్‌కార్ట్ పిచ్చెక్కించే ఆఫర్..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కంటే ముందే థామ్సన్ 7 కిలోల వాషర్ (ఎరుపు, తెలుపు)ను కేవలం రూ. 3,269కి కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.7,999గా ఉంది. ఇది కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. చిన్న ఇళ్లకు అద్భుతంగా ఉంటుంది. హెవీ-డ్యూటీ మోటారు 780 RPM అందించారు.

New Update
Washing machine Offers

Washing machine Offers

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాషింగ్ మెషీన్‌ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్‌లను కంపెనీ  అందిస్తోంది. ఈసారి కస్టమర్లు రూ.5,000 కంటే తక్కువ ధరకే వాషింగ్ మెషీన్‌లను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా ఇవి ఎన్నో రూ.వేలకు లభించే మెషీన్‌లు.. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ తక్కువ ధరకు కొనేందుకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తోంది. అంతేకాకుండా బ్యాంకు కార్డులను ఉపయోగించి కొనుక్కుంటే అదనపు డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Thomson 7kg washer only red, white

ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ 7 కిలోల వాషింగ్ మెషిన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ.7,999 ఉండగా.. ఇప్పుడు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 42 శాతం తగ్గింపుతో కేవలం రూ. 4,590లకే లిస్ట్ అయింది. అలాగే కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుక్కుంటే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ.1,330 వరకు ఈ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ వర్తిస్తే ఈ వాషింగ్ మెషీన్‌ను కేవలం రూ.3,269లకే సొంతం చేసుకోవచ్చు. అయితే దాని మోడల్, కండిషన్‌ను బట్టి ఈ ధర పొందొచ్చు. 

Thomson 7kg washer Specs

Thomson 7kg washer వాషింగ్ మెషీన్ కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇది చిన్న ఇళ్లకు అద్భుతంగా ఉంటుంది. ఇది అనేక వాష్ ప్రోగ్రామ్‌లకు మద్దతు ఇస్తుంది. వివిధ రకాల బట్టలను సులభంగా ఉతకడానికి వీలుగా ఉంటుంది. దీనిలో అమర్చిన హెవీ-డ్యూటీ మోటారు 780 RPMతో రన్ అవుతుంది. ఇది బట్టలు బాగా ఉతకడానికి సహాయపడుతుంది. థామ్సన్ దీనిలో స్మార్ట్ ప్రో వాష్ టెక్నాలజీని అందించింది.

ఇది తక్కువ నీరు, తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. దీని బాడీ తుప్పు పట్టకుండా ఉండేందుకు.. ABS మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు. ఇది చాలా కాలం పాటు మన్నికగా ఉంటుంది. ఈ మెషీన్ చిన్న కుటుంబాలకు, బడ్జెట్ అనుకూలమైన కొనుగోలుదారులకు గొప్ప ఎంపిక అని చెప్పుకోవచ్చు. తక్కువ ధర, శక్తివంతమైన మోటారు, మన్నికైన బాడీ, శక్తి సామర్థ్యం అన్నీ థామ్సన్ 7 కిలోల వాషింగ్ మెషీన్‌ను కొనేందుకు బెస్ట్ ఫీచర్లు. 

Advertisment
తాజా కథనాలు