Vivo Y500 Pro: వివో మావ కుమ్మేశాడు మచ్చా.. 200MP కెమెరాతో ఊరమాస్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

New Update
Vivo Y500 Pro LAUNCHED IN CHINA WITH 200MP CAMERA

Vivo Y500 Pro LAUNCHED IN CHINA WITH 200MP CAMERA

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Vivo Y500 Pro స్మార్ట్‌ఫోన్ 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 

Vivo Y500 Pro Price

Vivo Y500 Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇది 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,400గా ఉంది. అలాగే 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,900, 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,600, 12 GB RAM + 512 GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 32,400 ధరను కలిగి ఉంది. Vivo Y500 Pro ఆస్పిషస్ క్లౌడ్, సాఫ్ట్ పౌడర్, లైట్ గ్రీన్, టైటానియం బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. 

Vivo Y500 Pro specs

Vivo Y500 Pro స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 1.5K (1,260 × 2,800 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. Vivo Y500 Pro స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 200-మెగాపిక్సెల్ Samsung HP5 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. 

Vivo Y500 Pro.. 90 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది 5G, బ్లూటూత్, GPS, OTG, Wi-Fi, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం Vivo Y500 Pro స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు