/rtv/media/media_files/2025/10/31/vivo-x300-vivo-x300-pro-2025-10-31-14-21-38.jpg)
Vivo X300 & Vivo X300 Pro
Vivo కంపెనీ యూరప్‌లో Vivo X300, Vivo X300 Pro లను లాంచ్ చేసింది. గతంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు చైనాలో ప్రారంభించబడ్డాయి. ఈ రెండు ఫోన్‌లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. కంపెనీ బ్యాటరీలో గణనీయమైన మార్పు చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసిన మోడళ్లలో, కంపెనీ బ్యాటరీ సామర్థ్యాన్ని భారీగా తగ్గించింది. యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేసిన Vivo X300, Vivo X300 Pro ఫోన్‌ల మధ్య ధర, తేడాలను తెలుసుకుందాం.
Vivo X300, Vivo X300 Pro Price
Vivo X300, Vivo X300 Pro నిన్న యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. రెండు ఫోన్‌లు శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. Vivo X300 ధర యూరప్‌లో సుమారు రూ. 1,07,600గా ఉంది. ఈ ఫోన్ 16GB RAM + 512GB స్టోరేజ్‌తో వస్తుంది. అదేవిధంగా 16GB RAM + 512GB స్టోరేజ్ కలిగిన Vivo X300 Pro ధర యూరప్‌లో రూ. 1,43,500గా కంపెనీ నిర్ణయించింది.
Vivo X300, Vivo X300 Pro specifications
యూరోపియన్, చైనీస్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌లలో చాలా వరకు స్పెసిఫికేషన్లు ఒకేలా ఉన్నాయి. కానీ మరికొన్నింటిలో తేడాలు ఉన్నాయి. ఇక స్టాండర్డ్, ప్రో మోడళ్ల మధ్య వ్యత్యాసం విషయానికొస్తే.. Vivo X300.. 6.31-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ప్రో మోడల్ 6.82-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు ఫోన్‌లలో 8T LTPO డిస్‌ప్లే + 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు. రెండు ఫోన్‌లు 90W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో వస్తాయి.
Vivo X300లో శామ్‌సంగ్ HPB సెన్సార్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి 50MP సోనీ LYT-602 టెలిఫోటో లెన్స్ కూడా అందించారు. మూడవ కెమెరా 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉంది.
Vivo X300 Proలో 50MP సోనీ LYT-828 ప్రైమరీ కెమెరా, 200MP శామ్‌సంగ్ HPB టెలిఫోటో కెమెరా, అల్ట్రావైడ్ యాంగిల్ ఫోటోగ్రఫీ కోసం 50-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ JN1 సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీల కోసం Vivo X300, Vivo X300 Pro ఫోన్‌లలో 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇది 50MP Samsung JN1 సెన్సార్ ద్వారా శక్తిని పొందుతుంది.
గ్లోబల్ వేరియంట్‌లు Android 16 ఆధారిత OriginOS కు మద్దతు ఇస్తాయి. కంపెనీ గ్లోబల్ మోడళ్లలో బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గించింది. యూరప్‌లో విడుదలైన వివో X300 ఫోన్ 5,360mAh బ్యాటరీతో వస్తుంది. అయితే దాని చైనీస్ వేరియంట్ 6,040mAh బ్యాటరీను కలిగి ఉంది. అదేవిధంగా యూరప్‌లో విడుదలైన వివో X300 ప్రో ఫోన్ 5,440mAh బ్యాటరీతో వస్తుంది. అయితే చైనీస్ వేరియంట్ 6510mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. X300 ఫాంటమ్ బ్లాక్, హాలో పింక్ కలర్‌లలో వచ్చింది. X300 ప్రో ఫాంటమ్ బ్లాక్, డ్యూన్ బ్రౌన్ కలర్‌లలో వచ్చింది. రెండు ఫోన్‌లు అక్టోబర్ 30 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
 Follow Us