Vivo X100 Pro : తస్సాదియ్యా.. వివో ఫోన్‌పై రూ.40వేల భారీ తగ్గింపు - బెస్ట్ కెమెరా ఫోన్ అదిరింది..!

VIVO X100 Pro 5G విడుదలైనప్పటి నుండి మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో 16GB RAM, AMOLED స్క్రీన్, Zeiss బ్రాండింగ్‌తో కూడిన 50MP ట్రిపుల్ కెమెరా, 5400mAh బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు VIVO X100 Pro 5G ఫోన్‌ను Amazonలో భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు.

New Update
VIVO X100 Pro 5G

VIVO X100 Pro 5G

VIVO X100 Pro 5G విడుదలైనప్పటి నుండి మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో 16GB RAM, AMOLED స్క్రీన్, Zeiss బ్రాండింగ్‌తో కూడిన 50MP ట్రిపుల్ కెమెరా, 5400mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇప్పుడు VIVO X100 Pro 5G ఫోన్‌ను Amazonలో భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌పై దాదాపు 38% తగ్గింపును అందిస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉన్నాయి. భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. 

Vivo X100 Pro offers

VIVO X100 Pro 5G ఫోన్ జనవరి 2024 లో రూ.96,999 ధరకు లాంచ్ అయింది. అయితే అమెజాన్‌లో ఇప్పుడు 38 శాతం తగ్గింపు ఈ ఫోన్ కేవలం రూ.59,999 ధరకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే VIVO X100 Pro 5G ఫోన్ పై దాదాపు రూ.37,000 తగ్గింపు లభిస్తుందన్నమాట. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రైమ్ సభ్యులు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్‌పై రూ. 3,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి EMI లావాదేవీలపై రూ.1,799 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అప్పుడు దీని ధర మరింత తగ్గుతుంది. 

Vivo X100 Pro specs

Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్ 6.78 -అంగుళాల AMOLED 8T LTPO కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది MediaTek Dimensity 9300 ప్రాసెసర్, Vivo కొత్త V3 ఇమేజింగ్ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. Vivo X100 Pro ఫోన్ లో Zeiss బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 

ప్రధాన సెన్సార్ 50-మెగాపిక్సెల్ Sony IMX989 1-అంగుళాల సెన్సార్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మద్దతుతో ఉంటుంది. దీనితో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సూపర్-టెలిఫోటో కెమెరా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 4.3x ఆప్టికల్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ప్రైమరీ షూటర్, టెలిఫోటో కెమెరా రెండూ 100x డిజిటల్ జూమ్ వరకు అందిస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉంది. Vivo X100 Pro.. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 5,400mAh బ్యాటరీతో వస్తుంది.

Advertisment
తాజా కథనాలు