Vivo V60e 5G: రేంజ్ మారింది మావా.. 200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్ కిర్రాక్

వివో నుంచి కొత్త Vivo V60e 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదలైంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 200MP అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా. అలాగే 6,500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.

New Update
Vivo V60e 5G smartphone launching in india October 7

Vivo V60e 5G smartphone launch

Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V60e ని ఇవాల భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్, 12GB RAM ద్వారా శక్తిని పొందుతుంది. Vivo V60e ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు వివో V60e ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Vivo V60e Price

Vivo V60e మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ29,999.
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999.
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా కంపెనీ నిర్ణయించింది.

Vivo V60e స్మార్ట్‌ఫోన్ ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్‌లలో సేల్‌కి అందుబాటులో ఉంటుంది.

Vivo V60e ఫోన్ కోసం ప్రీ-బుకింగ్‌లు అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, SBI కార్డులతో ట్రాన్షక్షన్స్ చేస్తే 10 శాతం తగ్గింపు లేదా 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. కంపెనీ ఫ్రీగా ఒక సంవత్సరం పొడిగించిన వారంటీ, ఆరు నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌కు కూడా అందిస్తోంది.

Vivo V60e Specs

Vivo V60e మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2392 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌, తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. Vivo V60e  స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 12GB RAM + 256GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. Vivo V60e ఫోన్ Android 15 ఆధారంగా FuntouchOS 15పై నడుస్తుంది. 

ఈ మొబైల్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. Vivo V60eలో OIS సపోర్ట్‌, 30x జూమ్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది AI ఫెస్టివల్ పోర్ట్రెయిట్, AI ఫోర్ సీజన్స్ పోర్ట్రెయిట్, ఇమేజ్ ఎక్స్‌పాండర్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫీచర్లు కలిగిన భారతదేశపు మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.4, Wi-Fi, GPS, IR బ్లాస్టర్, టైప్-C 3.0 పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే వివో AI క్యాప్షన్, AI ఎరేస్ 3.0, AI స్మార్ట్ కాల్ అసిస్టెంట్, జెమినితో సహా AI ఫీచర్ల సూట్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. 

Advertisment
తాజా కథనాలు