New Smartphone: కొత్త వాటర్ ప్రూఫ్ మొబైల్ అదిరింది.. 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో ఫీచర్లు సూపరెహే..!

సోనీ ఎక్స్‌ పీరియా 10 VII స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్‌ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరాతో వస్తుంది. 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది యూకే, ఈయూ వంటి మార్కెట్లలో ప్రారంభమైంది.

New Update
Sony Xperia 10 VII

Sony Xperia 10 VII

సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా Sony Xperia 10 VII ఫోన్‌లో 120Hz OLED డిస్‌ప్లే ఉంది. కొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 3 చిప్‌సెట్ అందించారు. అలాగే 5,000mAh బ్యాటరీ ఉంది. ఇంకా మరెన్నో అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఈ మొబైల్ ధర మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Sony Xperia 10 VII Price

Sony Xperia 10 VII ధరను కంపెనీ రూ. 46,353గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, టర్కోయిస్, చార్‌కోల్ బ్లాక్ వంటి కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులో ఉంది. ఈ నెలలో UKలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ Xperia 10 VII త్వరలో భారత మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. 

Sony Xperia 10 VII Specs

Sony Xperia 10 VII మొబైల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను పూర్తి HD + రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 3 ప్రాసెసర్ అందించారు. Sony Xperia 10 VII ఫోన్‌లో 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. అలాగే ఇందులో 5,000mAh బ్యాటరీ అందించారు. ఇది 2 రోజుల బ్యాటరీ లైఫ్, PD ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కంపెనీ 4 ప్రధాన OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెఫ్టీ ప్యాచ్‌లను హామీ ఇస్తుంది. ఇందులో సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. 

ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. Sony Xperia 10 VII వెనుక భాగంలో 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది పూర్తి ఎన్‌క్లోజర్ డిజైన్‌తో స్టీరియో ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో.. Wi-Fi 6, బ్లూటూత్ 5.4, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C వంటి సపోర్ట్ ఉన్నాయి. Sony Xperia 10 VII ఫోన్‌లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IPX5/IPX8, IP6X రేటింగ్‌‌తో వస్తుంది. 

Advertisment
తాజా కథనాలు