/rtv/media/media_files/2025/11/10/realme-gt-8-pro-aston-martin-f1-edition-2025-11-10-17-56-45.jpg)
Realme GT 8 Pro Aston Martin F1 Edition
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన Realme GT 8 Pro Aston Martin F1 Edition సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రియల్‌మి GT 8 Pro మాదిరిగానే ఉన్నాయి. ఇది 16 GB RAM, 1 TB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల అయింది. స్పోర్ట్స్ కార్ల తయారీదారు కంపెనీ ఆస్టన్ మార్టిన్‌తో కలిసి రియల్‌మి ఈ స్మార్ట్‌ఫోన్‌ను డెవలప్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Realme GT 8 Pro Aston Martin F1 Edition price
Realme GT 8 Pro Aston Martin F1 Edition స్మార్ట్‌ఫోన్ సేల్ చైనాలో ప్రారంభమైంది. దీని ధర సుమారు రూ. 68,500గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్ కలర్‌లో లభిస్తుంది. దీనికి ఈ బ్రాండ్ రేసింగ్ గుర్తింపు సిల్వర్ వింగ్ లోగో కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ డ్యూయల్-వింగ్ ఏరోడైనమిక్ టెక్స్చర్‌ను కలిగి ఉంది.
Realme GT8 Pro Aston Martin F1 Limited Edition 💚
— Akash Gupta 🇮🇳 (@Akashak4020) November 4, 2025
It looks soo good! 😍
I hope it comes to India and the Global market. 😌 pic.twitter.com/gfrBn4xT0w
కాగా రియల్‌మే జిటి 8 ప్రో నవంబర్ 20న భారతదేశంలో లాంచ్ కానుంది. అదే సమయంలో రియల్‌మే జిటి 8 ప్రో ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 ఎడిషన్ కూడా దానితో పాటే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. Realme GT 8 Pro Aston Martin F1 Edition ప్యాకేజీలో కస్టమ్ గిఫ్ట్ బాక్స్, ఆస్టన్ మార్టిన్ లోగోతో కూడిన ఫోన్ కేస్, రేసింగ్ కీ-ఆకారపు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉన్నాయి.
Realme GT 8 Pro Aston Martin F1 Edition Specs
Realme GT 8 Pro Aston Martin F1 Edition స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు రియల్‌మే GT 8 ప్రో మాదిరిగానే ఉంటాయి. రియల్‌మే GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 ఎడిషన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6.78-అంగుళాల 2K BOE Q10+ డిస్‌ప్లేను QHD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 7,000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
Realme GT 8 Pro Aston Martin F1 Edition ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, శామ్‌సంగ్ HP5 సెన్సార్‌తో 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. కెమెరాలు 10x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌తో వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Follow Us