Mobile Offers: 5G స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్.. ఈ ఆఫర్లతో చిటికెలో కొనేయొచ్చు మావా..!

మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా పెరిగిపోయింది. కొందరి చేతిలో ఒకటి నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో కొత్త కొత్త కంపెనీలు తమ మోడళ్లలో అధునాతన ఫీచర్లు అందించి రిలీజ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

New Update
mobile offers Poco M7 5G offer

mobile offers Poco M7 5G offer

మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా పెరిగిపోయింది. కొందరి చేతిలో ఒకటి నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో కొత్త కొత్త కంపెనీలు తమ మోడళ్లలో అధునాతన ఫీచర్లు అందించి రిలీజ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. మరి మీరు కూడా అతి తక్కువ ధరలో అంటే కేవలం రూ.10,000 లోపు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. Poco M7 5G బెస్ట్ ఆప్షన్. 

ఈ Poco స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం Flipkartలో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదే సమయంలో ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌ల నుండి కూడా వినియోగదారులు ప్రయోజనం పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. Poco M7 5G డీల్స్, ఆఫర్‌లు, ధరల గురించి తెలుసుకుందాం. 

Poco M7 5G Price

Poco M7 5G లోని 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ఈ సంవత్సరం మార్చిలో రూ.9,999లకి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో PNB క్రెడిట్ కార్డ్‌తో చేసిన చెల్లింపులపై 10% తగ్గింపు (రూ.1,000 వరకు) ఉంటుంది. దీని తర్వాత ధర మరింత తగ్గుతుంది. అలాగే మీ ప్రస్తుత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా రూ.6,900 వరకు ఆదా చేయవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ గరిష్ట ప్రయోజనం మార్పిడి చేయాలనుకున్న మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. 

Poco M7 5G Specifications

Poco M7 5G స్పెషిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 1600x720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 4nm ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. భద్రత కోసం ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Xiaomi HyperOSపై నడుస్తుంది. Poco M7 5G మొబైల్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Poco M7 5Gలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP52 రేటింగ్‌తో అమర్చారు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS + GLONASS, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు