New Smartphone: ఒప్పో నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్లు.. 16GB ర్యామ్, 7,500mAh బ్యాటరీతో హైలైట్ ఫీచర్స్!

ఒప్పో త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో వస్తాయి. ఇప్పుడు భారత్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

New Update
Oppo Find X9, Oppo Find X9 Pro

Oppo Find X9, Oppo Find X9 Pro

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇటీవల చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు భారత్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 

Oppo Find X9, Oppo Find X9 Pro price

ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లోని Oppo Find X9, Oppo Find X9 Pro ఫోన్లు నవంబర్ 18న భారతదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు లీక్ అయ్యాయి. దీని 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌ బేస్ మోడల్ ధర రూ. 74,999, 16 GB + 512 GB వేరియంట్ ధర రూ. 84,999గా ఉంది. అదే సమయంలో 16 GB RAM + 512 GB స్టోరేజ్‌తో కూడిన Oppo Find X9 Pro ఏకైక వేరియంట్ ధర రూ. 99,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Flipkart ద్వారా కొనుక్కోవచ్చు.

అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. ఇదిలా ఉంటే Oppo Find X9 కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ బేస్ మోడల్ టైటానియం గ్రే, స్పేస్ బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. Oppo Find X9 Pro సిల్క్ వైట్, టైటానియం చార్‌కోల్ కలర్‌లలో లభిస్తుందని ఒప్పో తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం కంపెనీ రూ. 99 ప్రివిలేజ్ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ ప్యాక్‌లో రూ. 1,000 ఎక్స్ఛేంజ్ కూపన్, ఉచిత SUPERVOOC 80 W పవర్ అడాప్టర్, రెండేళ్ల బ్యాటరీ ప్రొటెక్షన్ వంటివి ఉన్నాయి. 

Oppo Find X9, Oppo Find X9 Pro specs (expect)

Oppo Find X9, Oppo Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు చైనాలో లాంచ్ అయిన వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. Oppo Find X9 మొబైల్ 6.59-అంగుళాల 1.5K (2,760 × 1,256 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది.  Oppo Find X9 Pro మోడల్ 6.78-అంగుళాల 1.5K (2,772 × 1,272 పిక్సెల్స్) LTPO డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఒప్పో ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో రెండూ 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ColorOS 16పై నడుస్తాయి. Oppo Find X9 మొబైల్ 7,025mAh బ్యాటరీ, Oppo Find X9 Pro 7,500mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి. ఈ రెండూ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. 

Advertisment
తాజా కథనాలు