New Smartphone: వైర్‌లెస్ ఛార్జింగ్‌‌తో కొత్త ఫోన్.. ఫీచర్లు మాములుగా లేవు భయ్యా..!

మోటరోలా ఈరోజు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో తన Motorola Edge 70ను విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 చిప్‌సెట్‌తో నడుస్తుంది. 6.67-అంగుళాల pOLED డిస్ప్లే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

New Update
Motorola Edge 70 launched

Motorola Edge 70 launched

మోటరోలా ఈరోజు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో తన Motorola Edge 70ను విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 చిప్‌సెట్‌తో నడుస్తుంది. 6.67-అంగుళాల pOLED డిస్ప్లే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. Motorola Edge 70.. 68W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇప్పుడు Motorola Edge 70 ఫీచర్లు, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. 

Motorola Edge 70 Price

Motorola Edge 70 సుమారు రూ. 80,000 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్‌లో సుమారు రూ. 81,000 కు త్వరలో లాంచ్ అవుతుంది.  ఈ ఫోన్ పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ లిల్లీ ప్యాడ్, గాడ్జెట్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది. 

Motorola Edge 70 Specifications

Motorola Edge 70 స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల pOLED సూపర్ HD డిస్‌ప్లేను 1220x2712 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 446ppi పిక్సెల్ డెన్సిటీను కలిగి ఉంది. Motorola Edge 70 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB RAM + 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఎడ్జ్ 70 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం Android 16పై నడుస్తుంది. 

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Motorola Edge 70లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, బ్లూటూత్, GPS, A-GPS, GLONASS, LTEPP, గెలీలియో, NFC, USB టైప్-C పోర్ట్, Wi-Fi 6E ఉన్నాయి. 

భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ అందించారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఫోన్ IP68 + IP69 రేటింగ్‌ను కూడా పొందింది. Motorola Edge 70.. 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,800mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. 

Advertisment
తాజా కథనాలు