Mobile Offers: కత్తిలాంటి ఆఫర్.. moto 3D కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ పై దుమ్ములేపే తగ్గింపు..!

పండుగల తర్వాత కూడా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై కత్తిలాంటి ఆఫర్లు అందిస్తోంది. గతంలో దసరా, దీపావళి వంటి పండుగల నేపథ్యంలో ఎన్నో ప్రొడెక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లు అందించింది.

New Update
MOTOROLA Edge 60 Fusion 5G price drop

MOTOROLA Edge 60 Fusion 5G price drop

పండుగల తర్వాత కూడా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై కత్తిలాంటి ఆఫర్లు అందిస్తోంది. గతంలో దసరా, దీపావళి వంటి పండుగల నేపథ్యంలో ఎన్నో ప్రొడెక్టులపై అదిరిపోయే డిస్కౌంట్లు అందించింది. ఇప్పుడు కూడా సంస్థ మొబైల్స్ పై తగ్గింపు కొనసాగిస్తోంది. మోటరోలా కంపెనీలో అత్యంత ప్రసిద్ధి చెందిన స్మార్ట్ ఫోన్ moto edge 60 fusion పై flipkart అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 

దీనిపై ఏకంగా రూ.7వేల వరకు ధరను తగ్గించింది. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో కలుపుకుని motorola edge 60 fusionను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల 3డి కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఇప్పుడు motorola edge 60 fusionకు సంబంధించిన ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి తెలుసుకుందాం. 

motorola edge 60 fusion offers

motorola edge 60 fusion స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.25999 ఉండగా.. ఇప్పుడు 11 శాతం తగ్గింపుతో కేవలం రూ.22,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.3వేల తగ్గింపు లభిస్తుందన్నమాట. అదే సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.3,000 తక్షణ తగ్గింపు పొందొచ్చు. అప్పుడు దీని ధర మరింత తగ్గుతుంది. అప్పుడు కేవలం MOTOROLA Edge 60 Fusion 5G రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు. 

అలాగే ఎక్స్ఛేంజ్ తగ్గింపు కూడా ఉంది. దాదాపు రూ.17,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ మొత్తం లభిస్తే.. అప్పుడు దీనిని కేవలం రూ.2,749లకే కొనుక్కోవచ్చు. అయితే ఇంత మొత్తంలో డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్, పనితీరు మెరుగ్గా ఉండాలి. ముఖ్యంగా రూ.20,000 లోపు ప్రీమియం లుక్, ఫ్లాగ్‌షిప్-స్థాయి పనితీరును కోరుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ అనే చెప్పాలి. 

MOTOROLA Edge 60 Fusion 5G specs

MOTOROLA Edge 60 Fusion 5G.. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల pOLED 3D కర్వ్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్ వీగన్ లెదర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. MOTOROLA Edge 60 Fusion ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68/IP69 రేటింగ్ ను కలిగి ఉంది.

MOTOROLA Edge 60 Fusion ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 5Gకి మద్దతు ఇస్తుంది. మిడ్-రేంజ్ విభాగంలో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. MOTOROLA Edge 60 Fusion ఫోన్‌లో 12GB వరకు RAM + 256GB స్టోరేజ్ కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను సులభతరం చేస్తుంది.

MOTOROLA Edge 60 Fusion హలో UI (ఆండ్రాయిడ్ 15) పై నడుస్తుంది. స్మార్ట్ రిప్లై, ఇమేజ్ సెర్చ్, ఆన్-డివైస్ AI అసిస్టెంట్ వంటి Google జెమిని ఆధారిత AI ఫీచర్లు కూడా ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరా (OIS మద్దతుతో), 13MP అల్ట్రా-వైడ్/మాక్రో లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో  5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Advertisment
తాజా కథనాలు