/rtv/media/media_files/2025/10/06/motorola-edge-50-fusion-huge-discount-2025-10-06-07-15-40.jpg)
Motorola Edge 50 Fusion huge discount
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ Flipkartలో Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రీమియం ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో వచ్చిన ఈ 5జీ ఫోన్ ఇప్పుడు మరింత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999లకి లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత దీనిని కేవలం రూ.18,999 కి కొనుగోలు చేయవచ్చు.
Motorola Edge 50 Fusion Offers
ఇది మాత్రమే కాకుండా Motorola Edge 50 Fusionపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1000 వరకు మరింత తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను 17,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ.14,260 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించుకుంటే దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక దీని 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 20,999 కి లభిస్తోంది.
Motorola Edge 50 Fusion Specs
Motorola Edge 50 Fusion మొబైల్ 6.7-అంగుళాల Full HD+ pOLED ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 5G చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. కెమెరా విషయానికొస్తే.. Motorola Edge 50 Fusion వెనుక OIS సపోర్ట్‌తో 50MP సోనీ LYTIA 700C ప్రైమరీ కెమెరా, మాక్రో విజన్ సపోర్ట్‌తో 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ (నానో-సిమ్ + ఈ-సిమ్) వంటి ఫీచర్లున్నాయి.